అరకులోఆగ్రహం, పోలీస్ స్టేషన్ దగ్ధం (వీడియో)

 

టిడిపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టుల హత్య చేసింది తెలుసుకదా.

  అరకు లోయ అంటుకుంది. ప్రజలు, టిడిపి కార్యకర్తులు కోపోద్రిక్తులయ్యారు. దుంబ్రిగూడ, అరకులోని  పోలీస్ స్టేషన్ లను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ లో చొచ్చు కెళ్లి ఫర్నిచర్ సామాగ్రి కి నిప్పు పెట్టారు. 

అమరావతి అప్ డేట్

అరకులో ఉద్రిక్త పరిస్థితులు, పోలీస్ స్టేషన్ పై విధ్వంసం అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల చర్చిస్తున్నారు.

ఇప్పటికే ఇంచార్జి డీజీపీ హరీష్ గుప్తా, ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు సంఘటనపై ఆరాతీశారు.

విశాఖ బేస్ క్యాంప్ నుంచి 6 ప్రత్యేక బృందాలు ఘటనా స్థలికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు

అవసరాన్ని బట్టి గ్రే హౌండ్స్ ను కూడా రంగంలోకి దించనున్న హోం శాఖ.

ఎప్పటికప్పుడు అరకులో పరిస్థితులను సమీక్షిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు.