చిన్న పిల్లలతో ఈ పాస్టర్ ఏం చేశాడో చూడండి

సిడబ్ల్యుసి పరిశీలనలో దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. సేవ ముసుగులో పాపాలు చేస్తున్న పాస్టర్ వేషాలు బయట పడ్డాయి. కొడవకంటి జోసెఫ్ అనే వ్యక్తి ఒంగోలు, క్లౌపేట, 6 వ లైనులో ఇండియా ఎవాంజెలిస్టిక్ రిలీఫ్ ఫెలోషిప్ అనే సంస్థను ముప్పై ఐదేళ్లుగా సాగిస్తున్నాడు. దీని ద్వారా దైవ బోధనల వ్యాప్తి చేస్తుంటారు. అందులోనే ఎయిడెడ్ పాఠశాల, వసతి గృహం ఏర్పాటు చేసి పేద, అనాధ పిల్లలకు వసతి, విద్య, వైద్యం అందిస్తుంటారు.

విదేశాల నుండి అండ్ ఫండ్స్ తో కోట్ల రూపాయలు కూడబెట్టి విలాసవంతమైన భవనం, ఖరీదైన కార్లతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటాడు. ఆ సంస్థలోని పాఠశాలకు కొడుకు కరెస్పాండెట్ గా, జోసెఫ్ భార్య రేచల్ ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆ పాఠశాల హాస్టల్ లో 156 మంది విద్యార్థులు ఉండగా వారిలో 46 మంది బాలికలు, 110 మంది బాలురు ఉన్నారు.

ఆ వసతి గృహంలో ఉండే బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు అతడిపై సీడబ్ల్యూసీ కి ఫిర్యాదులు అందాయి. దీంతో సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ భారతి, పరిశీలనా కమిటీ కన్వీనర్ ఫరూక్ బాషా ఆ హాస్టల్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడారు. తమపై పాస్టర్ చేస్తున్న అఘాయిత్యాలు వారితో చెప్పుకుని ఏడ్చారు ఆ బాలికలు. ఆ పాస్టర్ కి అక్కడే నాలుగు ఇల్లు ఉన్నాయట. ఆ ఇంటి పనితో పాటు అతనికి వంటి పని కూడా ఈ బాలికలే చేయాలట.

70 ఏళ్ళు పైబడినా 17 ఏళ్ళ టీనేజర్ నే అనుకుంటాడు కాబోలు ఆ బాలికలతో తాతయ్య కాదు మావయ్య అని పిలవమని చెప్తాడట. రాత్రి పన్నెండు గంటలైనా ఆ బాలికలను తన ఇంట్లోనే అట్టిపెట్టుకుని వారికి అశ్లీల చిత్రాలు చూపించి అందులో ఉన్నట్టు చేయమని బెదిరిస్తాడట. చేయమని చెప్తే నరకాన్ని చూపిస్తాడట వాళ్లకి. ఇదంతా ఒక కాగితంలో రాసిచ్చారట ఆ బాలికలు. బాలికల ఆవేదన తెలుసుకున్న సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, కమిటీ కన్వీనర్ ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలియజేసారు.

కమిటీ సభ్యులతో చర్చించిన కలెక్టర్ వినయ్ చంద్ ఆ బాలికలందరిని బాలసదన్ కు తరలించారు. కన్వీనర్ ఫరూక్ భాష ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ జోసెఫ్ పై ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతనిపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు అధికారులు.