సాఫ్ట్ వేర్ భార్య ఎఫైర్, సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్ కేసులో మరో మలుపు

పంజాగుట్టలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రశాంత్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రశాంత్… భార్య పావని వివాహేతర సంబంధం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో రాశాడు. అయితే ప్రశాంత్ తననే వేధించాడని, తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలియదని పావని ఆరోపిస్తుంది. తనను అంతా అవమానిస్తున్నారని, తన భర్త లేకుంటే ఇప్పుడు తనను ఎవరు చూసుకుంటారని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని పావని అంటోంది. ఊహించని విధంగా పావని మాట్లాడటంతో అంతా షాక్ అవుతున్నారు.

తనను అత్తామామ అవమానించారని, తన జీవితం ఇప్పుడు నాశనం అయ్యిందని పావని అంటోంది. తనకు ఎవరితో కూడా వివాహేతర సంబంధాలు లేవని పావని చెప్పింది. దీంతో పోలీసులు ఆధారాలతో సహా పావనికి వీడియోలు చూపించడంతో అప్పుడు పోలీసు విచారణలో తాను తప్పు చేశానని ఒప్పుకుంది. అప్పటి వరకు కూడా పావని తనకు ఎవరితో వివాహేతర సంబంధాలు లేవనే చెప్పిందట. ఆధారాలు చూపించే సరికి పావని నీళ్లు నమిలిందని పోలీసుల ద్వారా తెలుస్తోంది. పావనిలో పెద్దగా పాశ్చాత్తాపం కనిపించడం లేదని, తప్పు చేశాననే భావన అసలే లేదని వారన్నారు.

 

పక్కా ప్లాన ప్రకారమే పావని ఇలా చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్ చనిపోతే ఇక తనకు రూట్ క్లియర్ అవుతుందనే భావనకు కూడా పావని వచ్చిందని తెలుస్తోంది. ప్రశాంత్ ను మానసికంగా వేధిస్తే విడాకులు ఇస్తాడని అప్పుడు తాను ప్రణయ్ ని రెండో పెళ్లి చేసుకోవచ్చని పావని ఆలోచించినట్టు తెలుస్తోంది. ఆ ప్లాన్ ప్రకారమే పావని ప్రశాంత్ ని వేధింపులకు గురి  చేసినట్టు కావాలనే దూరం పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.

కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ ఐఐటి ఖరగ్ పూర్ టాపర్. ప్రస్తుతం సిలికాన్ ఇమేజ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.  ఇతనికి 2014లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికి పావని ప్రశాంత్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.

ఐఐటి టాపర్ కావడం, మంచి లక్షణాలు ఉండటంతో ప్రశాంత్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పావని కుటుంబ సభ్యులు కూడా ప్రశాంత్ భారీ కట్న కానుకలిచ్చి పెళ్లి చేశారు. ఉద్యోగ రీత్యా భార్య భర్తలు ఇద్దరు కూడా పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పావని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది.  

ప్రశాంత్ దోస్తు ప్రణయ్ తో పావనికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానంతో ప్రశాంత్ పావనిని ఉద్యోగం మాన్పించేశాడు.  ప్రశాంత్ డ్యూటికి వెళ్లగానే పావని ప్రణయ్ తో ఇంట్లోనే గడిపేది. దీని పై అనుమానం వచ్చిన ప్రశాంత్ పావనికి తెలియకుండా ఇంట్లోనే సిసి కెమెరాలు పెట్టాడు. ఆయన మొబైల్ లో పావని ఇంట్లో ప్రణయ్ తో గడిపై కార్యక్రమాలన్ని చూశాడు. అయినా కూడా పావనిలో మార్పు కోసం ప్రయత్నించాడు. పావనిని నిలదీసి అడిగితే అవును… ప్రణయ్ నాకిష్టమంటూ చెప్పటంతో ప్రశాంత్ షాక్ తిన్నాడు. భార్య మరోకరితో గడపడాన్ని సహించలేక ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.    పావని ప్రశాంత్ తో చాలా ఘోరంగా మాట్లాడిన ఆడియో రికార్డు కింద ఉంది వినండి. దాదాపు 30 నిమిషాలు ఉన్న ఈ ఆడియోలో పావని చాలా అవమానకరంగా మాట్లాడింది. 

https://www.youtube.com/watch?v=YmEt3IxVSNs&t=273s