పెద్దాసుపత్రిలో రోగులు, గర్భణీ స్త్రీల సమస్యలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ధర్నా నిర్వహించారు. నెల్లూరు పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వాసుపత్రి, పెద్దాసుపత్రి,ని కావాలనే ఒకపథకం ప్రకారం నిర్లక్ష్యానికి గురిచేసి చంపేసేందుకు కుట్ర జరగుతూ ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఆసుపత్రి ని అభివద్ధిచేసేందుకు పెద్దాసుపత్రిని పట్టించుకోవడం మానేశారని ఆయన అన్నారు.
పెద్దాసుపత్రిలో జరిగిన కాన్పులు ఎన్ని? బయట జరుగుతున్నవి ఎన్ని లెక్కలు చెప్పమని ఆయన నిలదీశారు. ఈ రోజు ఆయన నెల్లూరు పెద్దాసుపత్రికి వచ్చిన అక్కడి పరిస్థితుల మీద రోగులతో చర్చించారు. అక్కడ వసతులు సరిగ్గాలేవని ఆయన తెలుసుకున్నారు. అన్ని సమస్యలే ఆయనకు కనిపించాయి. మంచినీళ్లు లేవు. కరెంటు సరిగ్గాలేదు. లిఫ్ట్ పనిచేయదు. మరుగుదొడ్ల అసహస్యంగా ఉన్నాయని కనుగొన్నారు.
దీని మీద ఆయన ధర్నా చేపట్టారు. రేడియాలజిస్టును నియమించి, త్రాగునీళ్లు, కరెంటు, లిఫ్ట్, మరుగుదొడ్లు సమస్య పరిస్కారం అయ్యేదాకా కదలనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనితో అధికారులు దిగివచ్చారు.
48 గంటల్లో రేడియాలజిస్టును నియమిస్తామని, 26వ తేదీ లోపు కనీస వసతులు కల్పిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హామీ ఇచ్చారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు జోక్యం, ఉన్నతాధికారుల హామీతో ధర్నా ఆయన విరమించారు.