దారుణం : ఈ నెల్లూరు పోలీసులు ఏం చేశారంటే ?

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అత్యుత్సాహనికి ఓ తల్లి బలైంది. నిరుద్యోగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ డివైఎఫ్‌ఐ ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి డివైఎఫ్ ఐ కార్యకర్తలు బయలుదేరారు. అదే సమయంలో పోలీసులు వచ్చి వీరిని అడ్డుకున్నారు.  గ్రామానికి చెందిన మాధవ్ ను పోలీసులు దుర్భాషలాడుతూ చితకబాదారు. దీన్ని కళ్లారా చూసిన మాధవ్ తల్లి చిన్నమ్మ అక్కడికక్కడే గుండె పోటుతో కుప్పకూలి మరణించింది. ఈ హృదయ విదారకమైన ఘటనను చూసి  పలువురు కన్నీరు పెట్టారు. తన  తల్లి మృతికి బుచ్చిరెడ్డిపాలెం పోలీసులే కారణమని తన తల్లి శవాన్ని రోడ్డుపై ఉంచి మాధవ్, అతని కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు.