Home Crime షాకింగ్: మూడేళ్ల చిన్నారిపై తల్లి కర్కశత్వం..! కాలితో తన్ని.. నేలకేసి కొట్టి..

షాకింగ్: మూడేళ్ల చిన్నారిపై తల్లి కర్కశత్వం..! కాలితో తన్ని.. నేలకేసి కొట్టి..

నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తల్లి. ఆమె వెచ్చటి ఒడే బిడ్డకు ఆనందం. చిన్నారి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతారు తల్లిదండ్రులు. ఇంకా చెప్పాలంటే చిన్నారులు చేసే పనులు, ముద్దు ముద్దు మాటలు, అల్లరి ఎవరికైనా ఆనందాన్ని ఇస్తాయి. వారి అల్లరే తల్లిదండ్రులకు ఆనందం. ఐదేళ్లు వచ్చే వరకూ కూడా వారిపై చూపించే ముద్దు మురిపాలు మర్చిపోలేకుండా ఉంటాయి. అయితే.. ఇందుకు భిన్నంగా ఓ మహిళ తన బిడ్డను ఇష్టానుసారం కొట్టి.. నేలకేసి కొట్టి.. కాలితో తొక్కిపెట్టి.. ఇష్టానుసారం కొట్టిందంటే ఊహించగలమా? కానీ.. అత్యంత పాశవికమైన ఈ ఘటన జరిగింది.

Mh 1 1 | Telugu Rajyam

ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. చూస్తున్న ప్రతిఒక్కరి హృదయం ద్రవించే రీతిలో ఉంది. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని దారుణంగా చావ బాదింది. చాలాసేపు కొడుతూనే ఉంది. ఓ దశలో చిన్నారిని పైకెత్తి నేలకేసి కొట్టింది. దెబ్బలు తాళలేక ఏడుస్తూ వెళ్తున్న చిన్నారిని వెంబడించి మరి కొట్టింది. ఏకంగా చిన్నారి మెడపై కాలుతో తొక్కిపెట్టి క్రూరంగా ప్రవర్తించింది. కాళ్లతో తన్నింది. ఏమాత్రం దయ, జాలి లేకుండా చిత్రహింసకు గురి చేసింది.

 

అయితే.. ఓ వీధిలో జరిగిన అమానుష ఘటనను చుట్టుపక్కల వారు చోద్యం చూడటం విచిత్రంగా అనిపిస్తోంది. చిన్నారిని ఆ మహిళ కొడుతున్న సందర్భంలో ఓ వ్యక్తి అటుగా వెళ్లినా అడ్డుకోలేదు. చుట్టుపక్కల అందరూ చోద్యం చూశారు. వీడియో చివరలో మాత్రం ఓ వ్యక్తి వెళ్లి ఆ మహిళను చెప్పుతో కొట్టాడు. ఆమె చర్యను ఖండించిన వారు చేశారో, వీడియో వైరలే అయిందో కానీ.. పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె పోలిస్ స్టేషన్ లో ఉందని తెలుస్తోంది.

 

 

Related Posts

జస్టిస్ ఫర్ చైత్ర.. ఆ తర్వాతేంటి.?

ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి.. కాటికి కాలు చాపిన వృద్ధురాలు.. ఎవరూ...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

Cyber Crime: భారీ సైబర్ క్రైమ్..! 2.50కోట్లు దోచేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్..!

Cyber Crime: సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన రాజస్థాన్ లో జరిగింది. చాటింగ్ తో పరిచయమై.. నమ్మకం పెంచి.. స్నేహితురాలినని నమ్మించి.. ఏకంగా 2.50 కోట్లు దోచేసింది....

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News