బ్రేకింగ్ న్యూస్: సెల్‌ ఫోన్ కోసం స్నేహితుడి హత్య

హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ కోసం స్నేహితుడినే హత్య చేశాడు ఓ ఇంటర్ విద్యార్థి. ప్రేమ్, సాగర్ స్నేహితులు. ప్రేమ్ వద్ద ఉన్న సెల్ ఫోన్ పై సాగర్ కన్ను పడింది. లాంగ్ డ్రైవ్ వెళ్దామని ప్రేమ్ ని నమ్మించి సాగర్ ఆదిభట్లకు తీసుకెళ్లాడు. అక్కడ అతనిని హత్యచేసి కాల్చివేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ తీసుకొని సాగర్ ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల తర్వాత కేసును చేధించారు. దారుణం వెలుగు చూడటంతో ప్రేమ్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.