తనను చంపేస్తారని, తనతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యలందరికి ప్రాణహాని ఉందని అమృత సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను బతకనివ్వరని, తనను చంపేయడం ఖాయమని అమృత వ్యాఖ్యానించింది. శనివారం ప్రణయ్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు రావడంతో అమృత ఆందోళన వ్యక్త చేసింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. వారి సిసి టివి ఫుటేజిలు పరిశీలించగా శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి వారి ఇంటి ముందు కలియ తిరిగాడు. గోడ ఎక్కి బాల్కానీలోకి వచ్చినట్టు గుర్తించారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. అప్పుడే అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయాడు. దీనికి సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మీడియా సంస్థతో అమృత మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.