హిజ్రాతో కాపురం చేసి, అవి ఇవ్వలేదని చివరికి ఏం చేశాడంటే

ఆమె హిజ్రా అని తెలిసి కూడా ఆ యువకుడు ఆమె వెంట పడ్డాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి సహజీవనం చేశాడు. మూడు సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతుంది. కానీ డబ్బు ఆ యువకుడి మనస్సును మార్చింది. సహాజీవనం చేసిన హిజ్రానే చంపబోయాడు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది, అసలేంటి ఆ కథ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన రాధిక (హిజ్రా). ఇదే మండలం కొత్తతండాకు చెందిన దారావత్‌ సురేశ్‌ పట్టణంలోని హన్మంతరావు నగర్‌ కాలనీలో రాధిక అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. రాధికను చూసిన సురేష్ ఆమె వెంటపడి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వారి పరిచయం సహజీవనానికి దారితీసింది.

ఇటీవల రాధికకు చిట్టీ పైసలు వచ్చాయని సురేష్ తెలుసుకున్నాడు. బైక్ కొనుకుంటాను పైసలియ్యాలని రాధికను వేధించాడు. డబ్బులిస్తే పెళ్లి చేసుకుంటానని రాధికకు సురేష్ చెప్పాడు. దీంతో రాధిక డబ్బు ఇచ్చేందుకు అసలు ఒప్పుకోలేదు. పైసలు ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన సురేష్ రాధిక గొంతు కోసి పరారయ్యాడు. గమనించిన తోటి హిజ్రాలు రాధికను ఆసుపత్రికి తరలించారు.

రాధిక సురేష్ బాగానే ఉండే వారని తోటి హిజ్రాలు తెలిపారు. ఇప్పటి వరకు రాధిక సురేష్ 3 లక్షల రూపాయలు ఇచ్చిందని అయినా కూడా సురేష్ పైసల కోసం రాధికను వేధించాడని తెలిపారు. రైళ్లలో భిక్షాటన చేసి తీసుకువచ్చిన డబ్బులు ఏం చేస్తున్నావని కొట్టేవాడని, వారిద్దరి మధ్య అనేక సార్లు సయోద్య కుదిర్చామన్నారు. కానీ డబ్బు కోసం సురేష్ ఇంత దారుణానికి పాల్పడుతాడని తాము అనుకోలేదన్నారు. రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అసలు రాధిక సురేష్ చాలా బాగా ఉండేవారని రాధిక కూడా సురేషే తనకు అంతా తమతో చెప్పేదని హిజ్రాలు అంటున్నారు. రాధిక కూడా ఆసుపత్రిలో ఉన్నా సురేష్ మంచే ఆలోచిస్తుందన్నారు. తమ ఒత్తిడితోనే రాధిక ఫిర్యాదు చేసిందని రాధికకు సురేష్ పై ఫిర్యాదు చేయాలని ఇష్టం లేదని తెలిపారు. సురేష్ తన తప్పు తెలుసుకుంటే మంచిదని వారన్నారు.   

 

ఫ్లాష్ న్యూస్.. హైదరాబాద్ లో దారుణం https://bit.ly/2PeYWdr