స్టార్ హీరోని అరెస్ట్ చేయాలంటూ హిజ్రాలు డిమాండ్

హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. అంతేకాదు సినిమాల్లో హిజ్రా పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత తక్కువే. ఆ మధ్యన లారెన్స్ తన కాంచన చిత్రంలో శరత్ కుమార్ చేత హిజ్రా వేషం వేయించి అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు తమిళ నటుడు విజయ్ సేతుపతి మరోసారి అలాంటి పాత్రలో కనిపించి అలరించారు. .

విజయ్ సేతుపతి …హిజ్రా పాత్రను పోషించిన ‘సూపర్ డీలక్స్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా..హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని అంతా మెచ్చుచకున్నారు. సినీ విశ్లేషకులు సైతనం సేతుపతి నటనకి శభాష్ అంటున్నారు. అతని కెరియర్లో ఈ హిజ్రా పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమంటన్నారు.

అయితే విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ క్యారెక్టర్ డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తుంటాడు. అయితే ఈ సన్నివేశాల పట్ల హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

తమను ‘సూపర్ డీలక్స్’ సినిమాలో తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి హిజ్రా సంఘాలు. తమకు విజయ్ సేతుపతిపై మంచి అభిప్రాయం ఉండేదని, కానీ ఆయన ఈ సినిమాలో నటించి, దాన్ని నాశనం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

సినిమాలో విజయ్ పిల్లలని కిడ్నాప్ చేశారని, అలాంటి పనులు మేం ఎప్పుడైనా చేశామా..? అంటూ ప్రశ్నించారు. సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత విజయ్ నటించానని చెప్పాల్సింది అంటూ మీడియాతో కొందరు హిజ్రాలు అన్నారు.