మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ దోమలగూడలో విషాదం జరిగింది. దోమలగూడ బండానగర్ కి చెందిన లడ్డు (సంతోష్ ) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు మానేసి పార్ట్ టైం పనులకు వెళుతున్న లడ్డు కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం లడ్డు ఉదయం సమయంలో పాలు దొంగతనం చేశాడనే నేరాన్ని అతనిపై మోపినట్టు తెలుస్తోంది. లడ్డు దొంగతనానికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు లడ్డును స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఈ విషయం  ఆ నోటా ఈ నోటా అందరికి తెలిసిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లడ్డు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మహత్య చేసుకున్న సంతోష్ 

చేతికంది వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. చేయని తప్పును మోపి నిండు ప్రాణాన్ని బలి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అసలు విషయం తెలియదని పోలీసులు అంటున్నారు. లడ్డు మృతితో దోమలగూడలో విషాదం నెలకొంది. కలివిడిగా ఉండేవాడని లడ్డు స్నేహితులు అంటున్నారు.