ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ మధులిక పరిస్థితి అత్యంత విషమం

బర్కత్ పురలో ప్రేమోన్మాది భరత్ చేతిలో గాయపడ్డ ఇంటర్ సెకండియర్ అమ్మాయి మధులిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం మధులిక మలక్ పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉంది. 48 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. మధులిక పై దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు తేలింది. కడుపు, తల భాగాలలో తీవ్రమైన దెబ్బలు తాకాయి. దాంతో మధులికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. మెదడు ప్రాంతం వరకు దెబ్బలు తాకాయి. దీంతో మెదడు వరకు గాలి వెళ్లే ప్రమాదముందని డాక్టర్లు తెలిపారు. మెదడు ప్రాంతానికి గాలి వెళితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు.

మధులిక ఎడమచేతి బొటనవేలు కూడా తెగిపడింది. అసలు మధులికకు ప్రస్తుతం సర్జరీ చేసే పరిస్థితే లేదని డాక్టర్లు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మధులిక బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఏ క్షణాన ఏమని హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారోనని వారు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

బర్కత్ పుర ప్రాంతానికి చెందిన మధులికను అదే ప్రాంతానికి చెందిన భరత్ గత సంవత్సర కాలంగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. దీంతో మధులిక తల్లిదండ్రులు  భరత్ ను హెచ్చరించారు. అయినా కూడా అతనిలో మార్పు రాలేదు. దాంతో వారు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. వారు జనవరి 8 వ తేదిన భరత్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని తెలుస్తోంది. అప్పటి నుంచి నిశ్శబ్దంగా ఉన్న భరత్ గత వారం నుంచి మళ్లీ మధులికను వేదించడం ప్రారంభించాడు. దాందో మధులికను అతనిని వ్యతిరేకించింది. 

నిందితుడు భరత్

 బుధవారం ఉదయం కాలేజికి వెళ్లేందుకు మధులిక బస్టాంఢ్ వద్దకు వస్తుంది. ఇంతలో ఎదురొచ్చిన భరత్ మధులికను రోడ్డు నుంచి పక్క సందులోకి గుంజుకెళ్లాడు. అక్కడ తన  వద్ద ఉన్న కొబ్బరిబోండాల కత్తితో విచక్షణ రహితంగా మధులిక పై దాడి చేశాడు. ఈ దాడిని చూస్తూ స్థానికులు ఆపే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. దీంతో రెచ్చిపోయిన భరత్ రాక్షసత్వంగా వ్యవహరించి మధులిక పై 15 సార్లు కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. దాంతో ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. 

 అప్పుడు ఓ యువకుడు దైర్యంతో భరత్ ను బెదిరించేందుకు వెళ్లగా భరత్ పారిపోయాడు. ఆ తర్వాత మదులికను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మధులిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల అవ్వటం లేదు. విషయం తెలుసుకున్న నాయకులు , విద్యార్ధి సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. భరత్ ను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మధులిక పరిస్థితి మరింత విషమించింది. దీంతో అంతా మధులిక త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.