ప్రియుడిని మంచానికి కట్టేసి ప్రియురాలు ఏం చేసిందంటే

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడిని ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. పొదిలి పట్టణానికి చెందిన ఎస్కే షబ్బీర్ మర్రిపూడి పోలీసు స్టేషన్ లో హోంగార్డుగా పనిచేసేవాడు. రెండు నెలలుగా విధులకు దూరంగా ఉంటున్నాడు. షబ్బీర్ కు పొదిలి పట్టణానికి చెందిన ఇమాంబీ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. షబ్బీర్ కు ఇప్పటికే రెండు వివాహాలయ్యాయి. ఇమాంబీ, షబ్బీర్ లు కలిసి కొనకనమిట్ల మండలం చౌటపల్లి, పేరారెడ్డి పల్లెలో రెండు కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని వ్కాపారం ప్రారంభించారు.

 ఎస్కే షబ్బీర్, ఇమాంబీ

వ్యాపారంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో షబ్బీర్ ను అంతమొందించాలని ఇమాంబీ ప్రణాళిక వేసింది.  కోళ్ల ఫారం దగ్గరకు వచ్చిన ప్రియుడు షబ్బీర్ ను మాటల్లోకి దించి అతని కాళ్లు , చేతులను మంచానికి కట్టేసింది. ముందుగానే సిద్దం చేసుకున్న పెట్రోల్ ను అతడిపై పోసి నిప్పంటించింది. షబ్బీర్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకున్నారు. చెత్త తగల బెడుతున్నానని ఇమాంబీ వారిని నమ్మబలికింది. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్లో ఉన్న షబ్బీర్ ను గుర్తించి మంటలార్పే సరికే అతను మృతి చెందాడు.  అక్రమ సంబంధం మోజులో పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నారని చుట్టుపక్కల వారు అనుకున్నారు.

     

                                          మంటల్లో కాలిపోయిన ఎస్కే షబ్బీర్