హరికృష్ణ జీవితం ఇలా సాగింది…

హరికృష్ణ అంటే ఎన్టీయార్ కుటుంబంలో కొంచెం భిన్నమయిన వ్యక్తి. పట్టింపులు చాలా ఎక్కువ. అదే సమయంలో నిర్మొహమాటంగా చెబుతారు. 1982 లో ఎన్టీయార్ తెలుగుదేశం జైత్రయాత్ర పేరుతో రాష్ట్రమంతా  సుడిగాలి పర్యటన చేస్తున్నపుడు వాహనం నడిపిందెవరో కాదు, హరిక్రిష్ణయే. ఆయన జీవితం క్లుప్తంగా ఇది….

– 1956 సెప్టెంబర్2న జన్మించిన హరికృష్ణ(61)

– తెలుగుదేశం పార్టీ సంప్థాపకుడయిన నందమూరి తారక రామారావు నాలుగో కుమారుడు..

– శ్రీకృష్ణ అవతారం (1964) సినిమాతో బాలనటుడిగా సినిరంగప్రవేశం..

– సినిహీరోగా 1967లో పరిచయమైన హరికృష్ణ..పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న హరికృష్ణ.. హీరోగా , నిర్మాతగా పనిచేశారు..

– తల్లా పెళ్లామా (1970) తాతమ్మకల, రామ్ రహీమ్ (1974), దారవీరశూర కర్ణ (1977) వంటి హిట్ చిత్రాలలో నటించారు.  ఆ పైన చాలా కాలం తర్వత మరికొన్ని చిత్రాలలో నటించారు. 1998లో మోహన్ బాబు తో కలసి శ్రీరా ములయ్య తో  సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆతర్వాత నాగార్జునతో కలసి 1999లో సీతారామరాజు, లాహిరిలాహిరిలాహిరి (2202), సీతయ్య (2003)లలో నటించారు.

– ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీ అవిర్భవ సమయం నుంచి నేటి వరకు పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్నారు. 

-1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ.. 1996లో రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించారు

-2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. నాలుగేళ్లు ఉన్నారు. 

– ఎన్టీఆర్ రథసారథుడిగా గుర్తింపు కల్గిన వ్యక్తి హరికృష్ణ

– ఆయనకు ఇద్దరు భార్యలు.. లక్ష్మీ, శాలినీ.. ముగ్గురు కుమారులు జానికీరామ్, కళ్యాణ్ రామ.. జూనియర్ ఎన్టీఆర్.. కుమార్తే సుహాసిని

– రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన కు నిరసనగా రాజీనామా చేశారు.

– ప్రస్తుతం టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యుడుగా పనిచేస్తున్నారు..

– నందమూరి వారసుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎదిగిన హరికృష్ణ..

– ఎన్టీఆర్ చైతన్య రథాన్ని నడిపించిన హరికృష్ణ

– ఆయనకు కుటుంబమంటే అమితమైన ప్రేమ.. ముగ్గురు కొడుకులంటే మరింత ఇష్టం..

– జానకిరామ్ మృతి ఆయనను కలచి వేసింది.