హరిక్రిష్ణ మృతదేహంతో సెల్ఫీ, ఉద్యోగాలు ఊడిపోయాయి

హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీలు తీసుకున్నఉద్యోగులను కామినేని ఆసుపత్రి బర్త్ రఫ్ చేసింది. ఇది చాలా హేయమయిన చర్య అని పేర్కొంటూ సెల్ఫీ తీసిన మేల్ నర్స్ నరసింహను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రి మేనేజ్ మెంట్ తొలగించింది. నరసింహతో పాటు మహిళా నర్సులు హిమజ, సుమలత, ఆయా టి ఆది శేషుకుమ ారి లను కూడా ఉద్యోగాల నుంచి తొలగించేశారు.

ఈ సెల్ఫీ తీసిన వ్యక్తి నరసింహ. దానిని అతడు తన మిత్రుడికి పంపించాడు. ఆయన అందరితో షేర్ చేశాడు. దీనితో అది వైరలయింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరిక్రిష్ణను కామినేని తీసుకువచ్చాక ఆయన స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్ చాలా  ప్రయత్రాలు చేశారని, ఈ ప్రయత్నాలు ఫలించలకపోవడం, క్యాజువాల్టీ నుంచి డాక్టర్లు బయటకు వచ్చారని ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ లకు సహకరించేందుకు డ్యూటీ లో ఉన్ననర్సులు సెల్ఫీ తీసుకున్నారని విచారణలో వెల్లడయింది.

ఈ హేయమని చర్యతో డాక్టర్ల శ్రమంతా అపకీర్తి పాలయిందనిఆసుపత్రి డిజిఎంశ్రీధర్ రెడ్డి మీడియా కు చెప్పారు. సెల్ఫీ వైరలవుతున్న సమాచారం తెలియగానే ఉద్యోగులను తొలిగించామని, వారి మీద చర్య తీసుకునేందుకు నార్కట్ పల్ల ి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.

29వ తేదీన హరిక్రిష్ణ ప్రమాదానికి గురై నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణకు ఐసీయూలో చికిత్సనందించిన సిబ్బంది హరికృష్ణ మృతదేహంతో సెల్పీలు దిగారు. సెల్ఫీలు దిగితే దిగారు కానీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో  ఇప్పుడా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఒక నేత చనిపోయి అంతా విషాదంలో ఉంటే మృతదేహంతో సెల్ఫీలు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు