ప్రియురాలి ఇంటెదుటే నిప్పంటించుకొని ఆత్మహత్య (వీడియో)

తన ప్రేమను నిరాకరించిదని మనస్తాపానికి గురైన భాస్కర్ అనే యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోవడంతో క్షణాల్లో మంటలు శరీరానికి అంటుకున్నాయి. దాదాపు 95శాతం గాయాలతో భాస్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని బోరబండ సంజయ్ నగర్ కాలనీకి చెందిన భాస్కర్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో  ఫార్మసీ చదువుతుండగా పరిచయమైంది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇటీవల యువతి భాస్కర్ ను దూరం పెడుతుండటంతో భాస్కర్ మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన ప్రియురాలి ఇంటికి చేరుకొని ఆమె ఇంటిలో ఉన్న సమయంలో భాస్కర్ ఆమె ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. 95 శాతం గాయాలతో భాస్కర్ హాస్పిటల్ లో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

ఇద్దరం నాలుగేఃళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని ఇప్పుడు ఆ అమ్మాయి తనను నిర్లక్ష్యం చేస్తుందని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు భాస్కర్ మీడియాకు తెలిపారు. సోమవారం అమ్మాయి వాళ్ల బాబాయి తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని ఆరోపించాడు. వాళ్ల పెద్దల మాటలు విని అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని భాస్కర్ వాంగ్మూలం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది.