ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ జయరాం హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. అయితే జయరాం హత్య హైదరాబాద్ లో జరగడంతో ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. హైదరాబాద్ సిటి పోలీసులకు ఈ కేసును బదిలీ చేస్తున్నట్టు ఏపీ డిజీపి ఠాకూర్ తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ కేసును బదిలీ చేశామన్నారు.
జయరాం భార్య పద్మశ్రీ ఆంధ్రా పోలీసుల పై నమ్మకం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో హాజరుపరుచగా కోర్టు వారిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది.
దీంతో వారిని నందిగామ సబ్ జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా పోలీసుల నుంచి అన్ని పత్రాలు అందగానే కేసు విచారణ ముమ్మరం చేస్తామని హైదరాబాద్ సీపీ అన్నారు.