అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మరదలిపై కన్నేసిన బావ బలవంతంగా తన కోర్కెను తీర్చుకున్నాడు. చివరికి ఆమెకు కడుపు చేసి తప్పించుకోవాలని చూశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకి చెందిన బాలిక ఇంటర్ చదువుతూ హాస్టల్ లో ఉంటోంది. పట్టణంలోనే ఉంటున్న తన అక్క ఇంటికి సెలవులు ఉన్నప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే బావ మరదలి పై కన్నేశాడు. పలుసార్లు బలవంతం చేసి తన కోర్కెను తీర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల ఆ బాలిక తన ఆరోగ్యం బాగాలేదని స్వగ్రామానికి వచ్చింది.
ఆదివారం రాత్రి తీవ్రమైన ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఈ విషయం తెలియని తల్లిదండ్రులు అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. అంబులెన్స్ లో బాలికను ఆస్సత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రసవించి మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలికను విచారించగా అసలు నిజం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.