ప్రేమ విఫలమై ఇన్పోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారు. కిరణ్ గత కొంత కాలంగా  ఓ యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె కిరణ్  ప్రేమను తిరస్కరించడంతో కొన్ని రోజులుగా అతను నిరాశగా ఉన్నాడని స్నేహితుల ద్వారా తెలుస్తోంది. ప్రేమ విఫలమవ్వడంతో   మాదాపూరులోని తన రూములో ఫ్యానుకు ఉరివేసుకొని కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.