స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… ఒంగోలులో విషాదం

ఒంగోలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో విషాదం జరిగింది. ఒంగోలులోని ఎన్‌సీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తుండగా కరెంట్ షాక్ తో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. జెండా ఎత్తుతుండగా ట్రాన్స్ ఫార్మర్ కు ఇనుపరాడ్డు తగలడంతో షాక్ వచ్చి ఇద్దరు జవాన్లు చనిపోయారు. మృతులను బసంత్ రాణా , అప్పలనాయుడిగా గుర్తించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రమాదం జరగడంతో అంతా విషాదానికి గురయ్యారు. తమతో అప్పటి వరకు గడిపిన మిత్రులు కళ్లముందే చనిపోవడంతో తోటి జవాన్లు కన్నీరు పెట్టారు. ఎంతో ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చేశారని ఆనందంగా జెండా ఆవిష్కరణ చేస్తుండటంతో మిత్రులు చనిపోవడాన్ని తట్టుకోలేక పోతున్నామని తోటి జవాన్లు విలపించారు. ప్రమాదంతో ఒంగోలు లో విషాద చాయలు అలుముకున్నాయి.