Crime News: అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మైనర్ లు వాహనాలను నడపడం చాలా ఎక్కువైపోయింది. అతి చిన్న వయసులోనే వాహనాలు నడుపుతూ వాటిని కంట్రోల్ చేయలేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలుడు అతి వేగంగా ట్రాక్టర్ నడపడం వల్ల చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో మితిమీరిన వేగంతో ట్రాక్టర్ ని నడపటం వల్ల ఒక చిన్నారి మృతి చెందింది. చిన్నారి దీక్ష శ్రీ గేదెలను చూసి భయపడి పక్కన నిల్చోనింది. ఈ తరుణంలో అటువైపుగా వస్తున్న ట్రాక్టర్ నీ గమనించలేదు. అతి వేగంగా ట్రాక్టర్ నడుపుతున్న మైనర్ బాలుడు గేదెలు అడ్డుగా రావటంతో వాటిని తప్పించలేక సడన్ బ్రేక్ వేయటంతో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి దీక్ష శ్రీ నీ ఢీకొట్టి కాలువలోకి వెళ్ళింది. ఈ ఘటనలో చిన్నారి దీక్ష తీవ్ర గాయాలు అవటం వల్ల అక్కడికక్కడే అభివృద్ధి చెందింది.
ఈ ఘటనతో అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన సంభవించడానికి ట్రాక్టర్ మితి మీరిన వేగంతో నడపడమే కారణమని , మైనర్ బాలుడికి ట్రాక్టర్ పంపినందుకు ట్రాక్టర్ ఓనర్ పరశురాములు గ్రామస్తులు నిందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. అతి వేగంగా ట్రాక్టర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.