వామ్మో…ఫేమస్ అవ్వటానికి ఈ యువకుడు చేసిన పని తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోవాల్సిందే…?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు టీవీ సెలబ్రిటీలలాగా ఫేమస్ అవ్వటానికి తాపత్రయపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలామంది సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఫేమస్ అవ్వటానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే ఒక యువకుడు మాత్రం వినూత్నంగా ఫేమస్ అవ్వటానికి ఎవరు చేయని పని చేసి చూపించాడు. ఈ యువకులు చేసిన పని తెలిస్తే ఫేమస్ అవ్వటానికి ఇలాంటి పనులు కూడా చేస్తారా అని షాక్ అవుతారు. మధ్యప్రదేశ్ కి చెందిన 18 ఏళ్ల యువకుడు ఫేమస్ అవ్వటం కోసం ఏకంగా నలుగురిని హత్య చేశాడు. ఫేమస్ అవడం కోసం ఈ యువకుడు చేసిన పని తెలిసి స్థానికులు షాక్ అవుతున్నారు.

వివరాలలోకి వెళితే…మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాకు చెందిన శివప్రసాద్‌ ధుర్వీ అలియాస్ అనే యువకుడు చిన్ననాటి నుండి చాలా కోపంగా ఉంటూ ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు. స్కూల్ లో కూడా చిన్న విషయానికే తోటి విద్యార్థులతో గొడవ పెట్టుకొని వారి మీద దాడి చేసేవాడు. ఈ క్రమంలో అతను 8 వ తరగతిలో చదువు అపేసి ఇంటినుండి పారిపోయాడు. ఐదేళ్ళ కిందట ఇంటి నుంచి పారిపోయిన శివ ప్రసాద్ మహారాష్ట్రలోని పుణెలో ఓ హోటల్‌లో పనిచేసేవాడు. దీంతో అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇటీవల రాఖీ పండుగ రోజున చివరిసారిగా ఇంటికి వచ్చి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ త్వరలోనే తాను ఫేమస్ అవుతానని తన తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళాడు.

అయితే శివప్రసాద్ ధుర్వీ ఫేమస్ అవడం కోసం కష్టపడి పనిచేయడం మానేసి హత్యలు చేస్తూ సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. ఇంటి బయట నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇటీవల సాగర్ జిల్లాలో మూడు హత్యలు చేయగా.. భోపాల్ జిల్లాలో నాలుగో హత్య చేశాడు. వరుస హత్యలు జరుగుతుండటంతో నిఘా పెట్టిన పోలీసులు శివప్రసాద్ ధుర్వి నాలుగో హత్య చేసిన కొన్ని గంటలలోపే అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో అతనిని విచారించగా సాగర్ లో మూడు హత్యలు చేసినట్లు, అలాగే భోపాల్ లో కూడా హత్య తానే చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.