ఈమె మొగుడు ‘ఆ టైపు’ ఏం చేసిండో తెలుసా ?

తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడుతానని కట్టుకున్న భార్యను బెదదిరించాడు ఓ సాఫ్ట్ వేర్ శాడిస్టు భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు భార్యకు టిబి రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి హైదరాబాద్ లో నివాసముంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాచాని రాజేంద్ర ప్రసాద్ తో గత ఏడాది ఆగష్టు 2న వివాహం జరిగింది. కట్నంగా 45 లక్షల రూపాయల కట్నం, వివాహం అనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు.  తొలిరాత్రే భర్త తనతో తేడాగా వ్యవహారించాడని బాధితురాలు ఆరోపిస్తుంది. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడని తెలిపింది. తాను నపుంసకుడని ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని తెలిపింది.

బాధితురాలు

ఈ విషయం అబ్బాయి వాళ్ల అమ్మమ్మకు చెబితే తమ మనవడు నపుంసకుడేనని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమె బెదిరించింది. దీంతో విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగి పోయానని బాధితురాలు మీడియా ముందు వాపోయింది.

అత్తింటి వారి వేధింపులు భరించలేక బయటికి వచ్చానని పేర్కొంది. తన నపుంసకత్వం కప్పి పుచ్చుకోవడానికి టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడని దీంతో తాను అన్ని పరీక్షలు చేయించుకొని రిపోర్టులు తీసుకున్నానని తెలిపింది. అందులో తనకు ఎటువంటి రోగం లేదని డాక్టర్లు చెప్పారని మీ అబ్బాయికే పరీక్షలు చేయించాలని అత్తింటి వారిని కోరగా తమ అబ్బాయి ఎక్కడికి రాడని ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నారని తెలిపింది.

ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్ మరో పెళ్లికి రెడీ అయ్యారని సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని బాధితురాలు  అన్నారు. అతడికి శిక్ష పడిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తానన్నారు.

మంచి సంబంధం, సాఫ్ట్ వేర్ ఉద్యోగమని తమ కూతురికి డిగ్రీ సెకండియర్ లో నే వివాహం చేశామని బాధితురాలి తండ్రి అన్నారు. 45 లక్షలు కట్నంగా, మరో 10 లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటి వాడు అనుకోలేదన్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తమ తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కోన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.