పరిటాల శ్రీరామ్ కెరీర్లో అతిపెద్ద వెన్నుపోటు.. చంద్రబాబు అంటే అదే మరి !

Paritala Sriram shocked with Chandrababu's decision 
తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతల్లో పరిటాల కుటుంబం కూడ ఒకటి.  ఎన్నికలకు ముందే పరిటాల కుటుంబానికి చంద్రబాబుకు చెండింది.  తండ్రి పరిటాల రవీంద్ర వరుస విజయాలు సాధించిన పెనుగొండ నుండి పోటీచేయాలని శ్రీరామ్ ఆశపడ్డారు.  ఈ విషయాన్ని పరిటాల సునీత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.  తనకు రాప్తాడును, కుమారుడికి పెనుగొండను కేటాయించమని అడిగారు.  కానీ చంద్రబాబు మాత్రం పెనుగొండ టికెట్ ఇవ్వకపోగా కుటుంబానికి కేవలమొక్క టికెట్ మాత్రమే ఇస్తానని, అది కూడ రాప్తాడు నుండేనని, ఎవరు పోటీచేస్తారో తేల్చుకోమని అన్నారు.  దీంతో సునీత రాప్తాడు నుండి శ్రీరామ్ ను బరిలో నిలిపారు.  కానీ అనూహ్యంగా శ్రీరామ్ ఓడిపోవడం జరిగింది.  
Paritala Sriram shocked with Chandrababu’s decision
ఆ ఓటమితో పార్టీలో పరిటాల కుటుంబం హవా తగ్గింది.  ఏ దశలోనూ వారికి ప్రాధాన్యత దక్కలేదు.  ఓడిపోయాక కనీసం లెక్కలోకి కూడ తీసుకోవట్లేదు.  గెలుపోటములు సహజం.  అంతమాత్రానికి నిర్లక్ష్యం చేస్తారా అనే అసంతృప్తి సునీతలో మొదలైంది.  ఇక యువకుడైన శ్రీరామ్ మీరు మమ్మల్ని  పట్టించుకోకపోతే మేము పార్టీని పట్టించుకోము అనే రీతిలో నడిచారు.  కరోనా సమయంలో క్యాడర్ మొత్తాన్ని సైలెంట్ చేసేసి ఇంటికే పరిమితమయ్యారు.  కొన్ని నెలల పాటు ఏ పార్టీ కార్యక్రమంలోనూ కనబడలేదు.  అనంతపురంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నా స్పందించలేదు.  పార్టీ పదవుల్లో కూడ వారికి చోటు దక్కలేదు.  దీంతో పార్టీని వీడే సంకేతాలు పంపారు. ఈ తిరుగుబాటును  గమనించిన చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.  
 
పార్టీలో కీలకమైన తెలుగు యువత అధ్యక్ష పదవిని శ్రీరామ్ కు ఇవ్వనున్నట్లు ప్రచారం మొదలైంది.  గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ఉండేవారు.  ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాక పదవి ఖాళీ అయింది.  దాన్ని యువకుడైన శ్రీరామ్ చేతిలో పెడతారని, ఈ రకంగా పరిటాల కుటుంబానికి బాబు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని చెప్పారు.  శ్రీరామ్ సైతం ఈ సంకేతాలతో కాస్త మెత్తబడ్డారు.  కానీ ఉన్నట్టుండి ఆ పదవిని చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత గుంగ్లపల్లి శ్రీరామ్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రకటించేశారు.  దీంతో శ్రీరామ్ కు షాక్ తగిలింది.  పదవి ఇస్తారు, ఇవ్వబోతున్నారు, ఇచ్చేసినట్టే అంటూ ఊరించి ఊరించి చివరకు సొంత జిల్లా నేతకు కట్టబెట్టి పరిటాల కుటుంబాన్ని మరోసారి నిర్లక్ష్యం చేశారు.  మరి ఈ పరిణామం పట్ల శ్రీరామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.