‘పరిటాల’ వారసుడి నామకరణోత్సవం … ఉద్వేగంలో అనుచర,అభిమానగణం

Paritala Shriram named his son after his father

ఆంధ్ర ప్రదేశ్: రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ పరిటాల రవి ఫ్యామిలీకి అభిమానులు కేవలం అనంతపురంలో మాత్రమే కాదు స్టేట్ మొత్తం ఉన్నారు. పరిటాల రవి మరణాంతరం అనుచరగణం, అభిమానగణం ఆయన కొడుకు పరిటాల శ్రీరామ్ కి సపోర్ట్ గా ఉంటున్నారు. శ్రీరామ్‌‌కు కొడుకు పుట్టినప్పటి నుండి పరిటాల కుటుంబంలో ‘పరిటాల రవి’ మరలా జన్మించాడని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అనంతపురం రాజకీయాల్లో మరో తరం సిద్దం అవుతోందంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్లు పెట్టి వారి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

Paritala Shriram named his son after his father
Paritala Shriram named his son after his father

తాజాగా పరిటాల శ్రీరామ్ తనయుడి నామకరణోత్సవం ఘనంగా జరిగింది. వారసుడు పుట్టినప్పటి నుంచి పేరు ఏం పెడతారని చర్చ బాగా జరిగింది. పరిటాల శ్రీరామ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం తన తండ్రి పేరునే కొడుకుకు పెడతాడంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందరూ అనుకున్న విధంగానే పరిటాల శ్రీరామ్ తన కొడుకుకు రవీంద్ర అని తన తండ్రి పేరునే పెట్టుకున్నారు. ఇక తన తండ్రి పేరుతో తనయుడిని పిలిచే సమయంలో పరిటాల శ్రీరామ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడున్న వారంతా దివంగత పరిటాల రవిని గుర్తు చేసుకుని ఆవేదనకు లోనయ్యారు.