సాఫ్ట్ వేర్ భార్య ఎఫైర్, సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్

భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న విషయం తెలుసుకున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదమైన సంఘటన పంజాగుట్టలో జరిగింది. పూర్తి వివరాలేంటంటే.. 

కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ సిలికాన్ ఇమేజ్ సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి 2014లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్ కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పావని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. పావనికి మూడు నెలల క్రితమే బెంగళూరులో జాబ్ రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది.

పావని బెంగళూరులో జాబ్ చేస్తూ సెలవు రోజుల్లో హైదరాబాద్ వచ్చి వెళ్లేది. పావని హైదరాబాద్ లో పనిచేసినప్పుడే ప్రణయ్ అనే యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రశాంత్ కు తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలయ్యాయి. పెద్దలు నచ్చ చెప్పడంతో ఒక్కటయ్యారు. అయినా కూడా పావని ప్రవర్తనలో మార్పు రాలేదు. చాలాసార్లు ప్రశాంత్ పావనిని హెచ్చరించాడు.

ఇటీవల పావని బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయి వెళ్లి పోయింది. పావని వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ప్రణయ్ కూడా బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ పై వెళ్లి పోయాడన్న విషయం ప్రశాంత్ కు తెలిసింది. వీరిద్దరు అక్కడ కాపురం పెట్టి తనను నమ్మించేందుకు సెలవు దినాల్లో పావని హైదరాబాద్ వచ్చి వెళ్తుందని ప్రశాంత్ మానసిక క్షోభకు గురయ్యాడు.  

తన భార్యకు ఎన్ని సార్లు చెప్పినా మారలేదని తాను హైదరాబాద్ లో ఉంటే అడ్డుగా ఉంటానని భావించి బెంగళూరు కు వెళ్లి అక్కడ ఏకంగా కాపురమే పెట్టిందని ప్రశాంత్ సూసైడ్ నోట్ లో రాశాడు. తనకు జీవితం పై విరక్తి చెందిందని పావనికి ఎన్ని సార్లు చెప్పినా మార్పు రాలేదని లేఖలో బాధను వ్యక్తం చేశాడు. పావని వైఖరి వల్లే తాను చనిపోతున్నానని ప్రశాంత్ లేఖలో పేర్కొన్నాడు.

మరోవైపు ఈ వ్యవహారంపై పావని మాట్లాడుతూ.. తనకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రశాంత్ అనుమానించేవాడని తెలిపింది. రోజూ తనను వేధించేవాడని వెల్లడించింది. తాను ఎవరితోను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదని కావాలనే తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పావని తెలిపింది. మంచి ప్యాకేజితో జాబ్ రావడంతోనే తాను బెంగళూరుకు వెళ్లానని, వేరే ఉద్దేశ్యం లేదని పావని పోలీసుల విచారణలో తెలిపింది.

కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన పావనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.