హైదరాబాద్‌లో టెకీ ఆత్మహత్య

హైదరాబాద్ లోని చందానగర్ లో శ్వేత వారణాసి భగవత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. అపర్ణ సైబర్ జోన్‌లోని ఓ అపార్ట్ మెంట్ లో శ్వేత నివాసముంటోంది. వివాహమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో మనోవేదనకు గురై గురువారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత తరచూ పిల్లలు లేరని బాధపడుతుండేదని స్థానికలు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.