ఈ పోలీసు మహిళతో అలా.. వేటు పడింది

ఆయన ఏఆర్ కానిస్టేబుల్.. ఓ వివాహితతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఆయన ఆ మహిళతో  ఇంట్లో ఉండగా సదరు మహిళ భర్త రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఆయన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ మహిళ భర్త  రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు వివరాలేంటంటే…

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చాకలి రమేష్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అడిషనల్ డిసిపిగా పని చేస్తున్న అధికారి వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. సింగప్పగూడెం గ్రామానికి చెందిన మహిళ హిమాయత్ నగర్ లో నివసిస్తోంది. ఆమె తో గతంలో ఉన్న పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఏ ఆర్ కానిస్టేబుల్ రమేష్

కొంత కాలం నుంచి వీరి మధ్య సంబంధం కొనసాగుతోంది. సోమవారం రమేష్ డ్యూటిలో ఉన్నప్పుడే మహిళ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో మహిళ భర్త  రాజు ఇంటికి వచ్చాడు.  వీరిద్దరిని అలా చూసి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. తన వద్ద ఉన్న తుపాకిని మహిళ భర్తకు చూపించి చంపుతానని బెదిరించాడు. ఇంట్లో నుంచి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి రమేష్ ను పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటన పై మహిళ భర్త  రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

రమేష్, ఆ మహిళకు చదువుకున్న కాలంలోనే పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటుండడంతో ఇంటికి పోయినప్పుడు ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకున్నాడు. అలా చిన్న చిన్నగా ఫోన్లు, చాటింగ్ చేసి ఆ మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. మహిళ భర్త డ్యూటికి వెళ్లగానే రమేష్ ఏకంగా ఇంట్లోకి వచ్చే ఆమెతో గడిపేవాడు. భర్తకు అనుమానం రాకుండా ఆ మహిళ కూడా వ్యవహారం నడిపింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు రాజుకు అసలు విషయం చెప్పారు. 

చాలా సార్లు భార్యను అడిగినా కూడా తాను తప్పు చేయలేదని బుకాయించి తప్పించుకుంది. దీంతో ఆధారాలతో సహ పట్టుకోవాలనుకున్న రాజు రమేష్ ఇంట్లోకి రాగానే పట్టుకొని నిలదీశాడు. దీంతో అతనిని తుపాకితో రమేష్ బెదిరించాడు. స్థానికులు పట్టుకొని రమేష్ ను కొట్టారు. రాజు ఫిర్యాదుతో కేసు  నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. విషయం తెలుసుకున్న కమిషనర్ మహేష్ భగవత్ రమేష్ ను సస్పెండ్ చేశారు.