భార్యకు బాయ్ ఫ్రెండ్.. భర్తకు టెన్షన్

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తుందని… న్యాయం చేయండంటూ ఓ భర్త కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగాడు. ఇంతకీ ఏమైంది.. ఆ కథేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే మరీ

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాస్ చారి, రుక్మాపూర్ గ్రామానికి చెందిన లావణ్య 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో పంచాయితీ పెద్దల వద్దకు చేరింది.

2016 లో రుక్మాపూర్ సర్పంచ్ కర్రె శ్రీనివాస్ వద్దకు వీరి పంచాయితీ చేరింది. ఈ క్రమంలో లావణ్యపై కన్నెసిన సర్పంచ్ కర్రె శ్రీనివాస్ ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని భర్త ఆరోపించాడు. గతంలో చొప్పదండి స్టేషన్ లో ఫిర్యాదు చేశానని మానవతా ధృక్పధంతో కేసు వాపస్ తీసుకున్నానని అయినా ఆమెలో మార్పు రాలేదన్నాడు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు లావణ్య బావ తిరుపతి కలిసి తనపై ఎస్సీ, ఎస్టీ వరకట్నం కేసులు పెడుతామని బెదిరింపులకు గురి  చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపాడు. దీంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.