షాకింగ్!! పరిటాల సునీతతో మాట్లాడతా అంటున్న సూరి భార్య భానుమతి

అనంతపూర్ ఫ్యాక్షనిజం అంటే గుర్తొచ్చే రెండు పేర్లు పరిటాల రవి, మద్దెలచెరువు సూరి. పరిటాల రవిని సూరి అనుచరుడు మొద్దు శ్రీను హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకోగా, సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలోనే హతమయ్యాడు. ప్రస్తుతం పరిటాల రవి భార్య పరిటాల సునీత ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆవిడ ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
పరిటాల రవి హత్య, సూరి హత్య నుండి రక్తచరిత్ర సినిమా వరకు పలు అంశాలను ఇంటర్వ్యూలో వివరించారు భానుమతి. సూరి చనిపోయిన తర్వాత ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ఆవిడ తెలిపారు. తన భర్త కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ బ్రతికి ఉండి ఉంటే ఆవిడ పరిస్థితి బావుండేదని ఆశాభావం వ్యక్తం చేసింది భానుమతి. పరిటాల సునీత మీకు ఎదురుపడితే ఆవిడతో మాట్లాడతారా అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు భానుమతి షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఎదురుపడితే మాట్లాడతాను, నమస్తే చెబుతాను అన్నారు. ఆమె పలకరిస్తే నేను కూడా మాట్లాడతాను. ఆవిడ సాటి ఆడమనిషి మాట్లాడైతే తప్పేముంది అని చెప్పింది. అదంతా గతంలో జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని ఏం సాధించగలం అని భానుమతి ఇంటర్వ్యూలో చెప్పింది.