మ్యూజిక్ షూట్ కోసం వెళ్ళిన 8 మంది మోడల్స్ పై గ్యాంగ్ రేప్.. దక్షిణాఫ్రికాలో కలకాలం రేపిన ఘటన..!

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. చిన్న పెద్ద ఆయన్ని వయసు తేడా లేకుండా కొంతమంది పురుషులు వారి లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి మహిళల మీద విచ్చలవిడిగా అత్యాచార నేరాలకు పాల్పడుతున్నారు. మహిళల సంరక్షణకై ప్రభుత్వాలు కొత్త చట్టాలు అమలుపరిచి ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ మహిళల మీద జరిగే ఈ అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 మంది మోడల్స్ పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే…దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్సెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న క్రూగెర్స్‌డార్ప్ అనే పట్టణంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ కోసం కొందరు మోడల్స్ తో పాటు వారి సహాయక సిబ్బంది కూడా షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. అయితే షూటింగ్ కోసం సెట్ నిర్మించడానికి వచ్చిన సిబ్బంది పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడికి చేరుకున్న వెంటనే సెట్ నిర్మించడానికి వచ్చిన వారు ముందుగా వాహనం దిగి షూటింగ్ కోసం వచ్చిన ఎనిమిది మంది మోడల్స్ ని ఆయుధాలతో బెదిరించారు. ఆ తర్వాత వారందరూ సామూహికంగా మోడల్స్ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణమైన ఘటనలు ఒక మోడల్ పై ఏకంగా 10 మంది అత్యాచారం చేయగా మరొక మెడల్ పై 8 మంది అత్యాచారం చేశారు. మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ కోసం వచ్చిన మోడల్స్ అందరూ దాదాపు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారని సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అత్యాచార ఘటన సౌత్ ఆఫ్రికాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సామూహిక అత్యాచార ఘటనలో మొత్తం 20 మందిని నిందితులుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోస స్పందిస్తూ ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించాడు.