పూజా మాంత్రికుడు భర్తకు మత్తు మందిచ్చి… ఇల్లాలిని

ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసేందుకు వచ్చిన మాంత్రికుడు ఆ కుటుంబంలో చిచ్చు రేపాడు. కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూల్ జిల్లా డోన్ లోని కొండపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసులు భార్య లక్ష్మీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న రంగస్వామి అనే మాంత్రికుడు ఆ ఇంటికి వచ్చి ఇంట్లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయని, క్షుద్రపూజలు చేస్తే ఆమె అనారోగ్యం నయమవుతుందని చెప్పాడు.

మాంత్రికుడి మాటలు నిజమేనని నమ్మిన శ్రీనివాసులు సరేనన్నాడు. అయితే గత కొంత కాలంగా పూజల పేరుతో మాంత్రికుడు తరచూ శ్రీనివాసులు ఇంటికి వచ్చి పూజలు చేసి వెళుతుండేవాడు. ఈ క్రమంలో మాంత్రికుడితో లక్ష్మీకి పరిచయం ఏర్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మీపై కన్నేసిన మాంత్రికుడు శ్రీనివాసులుకు మత్తు మందిచ్చాడు. శ్రీనివాసులు అపస్మారక స్థితిలోకి జారుకున్నాక లక్ష్మీ, ఆమె కుమార్తెను తీసుకొని మాంత్రికుడు పరారయ్యాడు. కాసేపటికి మెలకువ వచ్చి చూసిన శ్రీనివాసులుకు ఇంట్లో భార్య, కుమార్తె కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మాంత్రికుడితో లక్ష్మీ వెళ్లిపోవడంతో హాట్ టాపిక్ ఈ చర్చ మారింది.