క్లాసు రూములో WWE  (వీడియో)

తమిళనాడు లోని తూత్తుకుడిలో విషాదం  జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి చావుకు వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఒడియార్, బాల నర్సింహ్మల మధ్య వివాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఒడియార్… బాలనర్సింహ్మను ఎత్తుకుని ఒక్క సారి లేపి కింద ఎత్తేశాడు. దీంతో బాలనర్సింహ్మ ఉలుకుపలుకు లేకుండా కిందపడిపోయాడు.

భయపడిన తోటి విద్యార్థులు వెంటనే ఒడియార్ ను హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో ఒడియార్ కోలుకుంటున్నాడు.  భయపడిన  బాలనర్సింహ్మ వెళ్లి ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సింహ్మ ఇంటికి రాకపోవడంతో అనుమానించిన తల్లి దండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు గాలిస్తుండగా నర్సింహ్మ ఓ బావిలో శవమై కనిపించాడు. దీంతో నర్సింహ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్దులు ఘర్షణకు పాల్పడిన  వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది.