టివి రిపోర్టర్ వేధింపులు, పిఎస్ ముందే కుటుంబం ఆత్మహత్యాయత్నం

కృష్ణాజిల్లా కోడూరు లో  ఒక టివి చానెల్ రిపోర్టర్ చేసిన దోపిడీ వెలుగులోకి వచ్చింది. కోడూరు మండలం , నక్కవానిదారి గ్రామానికి చెందిన ఓ కుటుంబం కోడూరు పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

ఎన్ టివి అవనిగడ్డ నియోజకవర్గ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న పెరవలి రవి అనే వ్యక్తి తమ కుటుంబంలో చిచ్చు పెట్టాడని, తనకు 50 వేలు డబ్బు లేదా 25 సెంట్లు పొలం రాసివ్వాలని బెదిరిస్తున్నట్లు ఒక కుటుంబం వాపోయింది. అలా చేయని పక్షంలో తన కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్ మీద లాగుతాని బెదిరించడంతో వారు ఆత్మహత్యాయత్నానికి సిద్ధ పడ్డారు. 

పోలీసులు కూడా తనను ఏమి చేయలేరని, నా మీద కేసులు పెట్టలేరని బెదిరించడంతో …చేసేది లేక కుటుంబం పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్య కు ప్రయత్నించారు. విషయాన్ని గమనించిన పోలీసులు వారి వద్ద నుండి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.  

వరసగా పోలీసు లను ఆశ్రయిస్తున్నారు ఎన్ టివి రవి బాధితులు. ఆదివారం కూడా నక్కవానిదారి గ్రామానికి చెందిన మరిశెట్టి వీరబాబును బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. గవర్నమెంట్ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నావంటూ దాన్ని వార్తగా వేయకుండా ఉండాలంటే  50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు చెప్పారు. అంత సొమ్ము ఇవ్వకపోతే కేసు కట్టిస్తానని బెదిరించారని ఆయన తెలిపారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఎన్ టివి రిపోర్టర్ రవి మీద 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు లేకుండా చేసేందుకు కొందరు పెద్దలు రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతోంది. బాధితుల తాలూకు వీడియోలు పైన ఉన్నాయి చూడండి. వారేమంటున్నారో?