బెజవాడ దుర్గమ్మ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై సస్పెన్షన్ వేటు పడింది. చీర మాయం ఘటనపై ఆలయ ఈవో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పాలక మండలి సభ్యురాలు సూర్యలతే తీసినట్టుగా విచారణలో తేలిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈవో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం చీర మాయం అంశం సీరియస్ గా తీసుకోవడంతో సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని కావున చర్యలు మాత్రమే తీసుకుంటే సరిపోతుందని ఈవో తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆలయ చైర్మన్ గౌరంగబాబు సూర్యకుమారిని సస్పెన్షన్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.