బ్యాంకాక్‌లో ఆంధ్రా టెకీ మృతి (వీడియో)

బ్యాంకాక్ లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఏపికి చెందిన పల్లంపాటి వెంకటేష్ మృతి చెందాడు. కృష్టా జిల్లా మచిలీ పట్నానికి చెందిన వెంకటేష్ హైదరాబాద్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఆఫీసు పనిమీద ఈ నెల 7న దాదాపు వంద మంది బ్యాంకాక్ కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతుంటే నీటిలో మునిగి చనిపోయాడని బ్యాంకు అధికారులు చెప్పారని మృతుని తమ్ముడు చరణ్ తెలిపారు.

ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో కొడుకు చనిపోవడంతో వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికందొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో వారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తమతో అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితుడు మరణించడంతో తోటి స్నేహితులు ఆవేదన చెందుతున్నారు. వెంకటేష్ మరణంపై అనుమానాలున్నాయని, అంత మంది ఉన్నా తన అన్నకే ఎందుకు ప్రమాదం జరుగుతుందని వెంకటేష్ తమ్ముడు చరణ్ ప్రశ్నిస్తున్నారు. వెంకటేష్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వెంకటేష్ తమ్ముడు చరణ్