మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పరిధిలోని యానంపేట్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని డిసిఎం తగలబడింది. ప్రయాణిస్తున్న డిసిఎంలో నే మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ డిసిఎం ఆపి కిందకు దిగాడు. దీంతో ప్రమాదం తప్పింది.
స్థానికులు ఫైరింజన్ కు సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. డిసిఎం పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డిసిఎం తగులపడుతున్న వీడియో కింద ఉంది చూడండి.