పోలీసుల నిర్వాకానికి మంటలలో కాలి బూడిదైన తల్లి కూతుర్లు..?

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు మనసుని కలిచివేస్తాయి. తాజాగా ఇలా మనసుని కలచివేసే సంఘటన ఉత్తర్ ప్రదేశ లోని డెహట్ జిల్లా లో చోటు చేసుకుంది. పోలిసుల నిర్వాకం వల్ల గుడిసెలో నివసిస్తున్న తల్లీ కూతుర్లు మంటలలో కాలి సజీవ దహనం అయ్యారు. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిని కటినంగా శిక్షించాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.

వివరాలలోకి వెళితే… ఉత్తర్ ప్రదేశ లోని డెహట్ జిల్లా కాన్పూర్ లోని మౌడలి గ్రామం. ఇక్కడే ఒక 45 ఏళ్ల మహిళ, తన 20 ఏళ్ల కూతురితో పాటు కులిపనులు చేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి స్థానిక అధికారులు కాన్పూర్ ఏరియాలోని కొన్నిప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుడిసెలో ఉంటున్న ఆ తల్లీ కూతురు ఇటీవల కాలిబూడిదై మరణించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటన గురించి సమచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

తల్లి కూతురు ఇలా వంటలలో ఖాళీ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. వారిని కాలేజ్ చేయించడం కోసం వారిద్దరు గుడిసెలో ఉండగానే స్థానిక పోలీసులకు గుడిసెకు నిప్పు పెట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం.. ఆ తల్లీ కూతురు కలిసే వారి గుడిసెకు నిప్పు పెట్టుకున్నారని తెలిపారు. దీంతో పోలీసు అధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యి ఏకంగా 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. తల్లీ కూతురి చావుకి కారణమైన పోలీసులను వెంటనే పదవి నుండి తొలగించి కటినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.