చత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. తిమెనార్ ఫారెస్ట్ ఏరియా నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ-బీజాపుర్ బోర్డర్‌లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎస్‌టీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, 15 బోర్ రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా బోర్డర్‌లోని తిమినార్, పుస్నార్ గ్రామాల సమీపంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మరింత మంది నక్సల్స్ ఉంటారనే అనుమానంతో భద్రతాదళాలు అడవంతా కూంబింగ్ చేస్తున్నాయి.