సెల్ ఫోన్ ఎంత పనిచేసిందబ్బా?

కర్నూల్ జిల్లాలో సెల్ ఫోన్ పేలి ఓ బాలుడి చేతివేళ్లకు తీవ్రగాయమైంది. తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన జనార్ధన్ అనే తొమ్మిదేళ్ల బాలుడి చేతిలో సెల్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాలుడు జనార్ధన్ చేతివేళ్లు తెగిపడిపోగా, అతను కడుపుపై కూడా గాయాలయ్యాయి. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పొలం దగ్గర తండ్రి సెల్ ఫోన్ లో పాటలు వింటుంటే సెల్ ఫోన్ పేలింది. ఉదయం నుంచి పాటలు వింటుంటే సెల్ ఫోన్  హీటెక్కి పేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. కుడి చేతిలో ఫోన్ పేలడంతో చేతి వేళ్లు తెగిపడ్డాయి. తల దగ్గర పేలి ఉంటే బాలుడి ప్రాణాలకే ఎసరొచ్చేదని పలువురు అంటున్నారు.

తీవ్రంగా గాయపడ్డ బాలుడు జనార్ధన్ 

చిన్నపిల్లలకు ఫోన్లు దూరంగా ఉంచడం చాలా మంచిది. మరి ముఖ్యంగా చార్జింగ్ పెట్టి పాటలు వినడం.. ఛార్జింగ్ అవుతుండగానే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమాలు చూడటం ద్వారా ఈ మధ్య చాలా స్మార్ట్ ఫోన్లు హీటెక్కిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.