సూర్యాపేట జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో మంటలు, కారు దగ్ధం (వీడియో)

సూర్యాపేట జిల్లాలో ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. మద్దిరాల మండలంలోని కుంటపల్లి గ్రామ సమీపంలో ప్రయాణిస్తున్న కారులో హఠాత్తుగా మంటలు రావడంతో కారు కాలి బూడిదైంది. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదాన్ని పసిగట్టి బయటకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.