బెజవాడ దుర్గమ్మ చీర దొంగెవరో తెలిసిపోయింది (వీడియోలు)

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో మాయమైన చీర దొంగ ఎవరో తెలిసిపోయింది. ఉండవల్లికి చెందిన లలితా మండలి సభ్యులు దుర్గమ్మకు సమర్పించిన చీర మాయమైన ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి అసలు దొంగెవరో కనిపెట్టగలిగారు.

ఆలయ ప్రధానార్చకుడు శంకర్ శాండిల్య దీనిపై వివరణ ఇచ్చారు. ఉండవల్లికి చెందిన భక్తులు ఇచ్చిన చీరను పాలకమండలి సభ్యురాలు సూర్యలత గులాబీరంగు కవర్లో పెట్టి తీసుకెళ్లారన్నారు. దానిని రిజిష్టర్ చేయించలేదు చేయించాలి అని చెప్పినా వినకుండా సూర్యకుమారి తీసుకెళ్లిందని, సూర్యకుమారి గారి మీద తనకు ఎటువంటి కోపం లేదని న్యాయం చెప్పటం నా ధర్మమని శాండిల్య తెలిపారు.

దీనిపై ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత స్పందించారు. ఉండవల్లి భక్తులు ఇచ్చిన చీర పూజారులు తీసి కింద పెట్టారని ఆ తర్వాత అది ఏమైందో తనకు తెలియదన్నారు. యాదవ సంఘం వాళ్లు ఇచ్చిన చీర మాత్రమే తాను తీసుకెళ్లానని దానిని చూసి భక్తులు అపోహ పడ్డారన్నారు. 

చీర మాయం ఘటనపై పోలీసులు విచారణ చేశారు. సీసీ టివి లేకున్నా కూడా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశారు. దాని ప్రతిని ఇవ్వాలని ఆలయ ఈవో పద్మ కోరగా పోలీసులు ఆమెకు ప్రతిని అందజేశారు. ప్రభుత్వం సీరియస్ కావడంతో 24 గంటల్లోనే ఆలయ ఈవో నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ, చర్చ బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది.

సూర్యలత మీద ఆంక్షలు

అయితే, మధ్యాహ్నం తర్వాత సూర్యలత  మీద యాక్షన్ తీసుకున్నారు. పూజారి శాండిల్య చెప్పిన వివరాల ను బట్టి ఆమె  మీద అను మానం వ్యక్తం చేస్తూ విచారణ పూర్తయ్యే దాాకా  ఆలయంలోకి రావద్దని ఆమె మీద ఆంక్షలు విధించారు. నిజానికి  పాలక మండలి సభ్యుల్లో ఒకరు కొట్టేశానరని అనుమానం ఉన్నందునే సారెగా అమ్మవారికి వచ్చిన రు. 18 వేల విలువయిన ఈ చీరో చౌర్యం గురించి లోలో న  దాయాలని చూశారు. అయితే, ఇది మీ డియాకు తెలిసి రచ్చ కావడంతో ఆలయం ఇవొ విచారణ జరిపి సూర్యలత మీద చర్య తీసుకోవాలని సూచించినట్లుసమాచారం. అయితే, ఉన్న ఫలానా తీసేస్తే అధికార పార్టీ ఎలాంటి వాళ్లను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తున్నారో ననే అపకీర్తి వస్తుందనే భయంతో లోతయిన విచారణకు ఆదేశించారు.

సూర్యలత రాజీనామా?

ఇలా ఉంటే  విచారణ నివేదిక రావాడానికి ముందే సూర్యలత  గుడి పాలక మండలి నుంచి తప్పుకోవచ్చని అంటున్నారు. విచారణ జరిపి ఆమెను దోషిగా చేసి రాజీనామా చేయిస్తే పరువు పోతుంది కాబట్టి, టిటిడి వ్యవహారంలో జరిగినట్లే,సూర్యలతకూడాస్వచ్ఛందంగా తప్పుకునేట్లు చేస్తారని, దీనికి రంగం సిద్దమయిందని తెలిసింది.