ఉత్తరప్రదేశ్ లో దారుణం.. గదిలో పెట్టీ విద్యార్థిని శిక్షించిన ఉపాద్యాయులు?

 

తెలిసి తెలియని వయసులో విద్యార్థులు కొన్ని సందర్భాలలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొందరు ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. విద్యార్థుల చేసిన తప్పులకు దారుణమైన శిక్షలు విధిస్తూ వారిని అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి వాచ్ దొంగలించాడన్న నేపంతో విద్యార్థిని ఒక గదిలో పెట్టి దారుణంగా కొట్టి హింసించారు. ఈ ఘటన ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ లో చర్చనీయంగా మారింది.

వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ లోని ఛిబరమవు కొత్వాలి కసవ గ్రామంలో జహంగీర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడి కి దిల్షాన్‌ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. దిల్షాన్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో స్కూల్ హెడ్ మాస్టర్ దిల్షాన్ ను పిలిపించటంతో అతడు హెడ్ మాస్టర్ గదికి వెళ్ళాడు. దిల్షాన్ గదిలోకి వెళ్లగానే తలుపులు మూసేశారు. అప్పటికే హెడ్ మాస్టర్ రూమ్ లో ఉన్న మరో ఉపాధ్యాయులు ప్రభాకర్‌, వివేక్‌ లు దిల్షాన్ వద్దకు వచ్చి వాచీ దొంగతనం చేశావంటూ దారుణంగా కొట్టారు. ఉపాద్యాయులు దిల్షాన్ ని దారుణంగా కొట్టడంతో ఈ ఘటనలో దిల్షాన్ కి తీవ్ర గాయాలయ్యాయి.

ఉపాద్యాయులు దిల్షాన్ ని శిక్షించిన సమచారం అందుకున్న అతని కుటుంబసభ్యులు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని గాయాలపాలైన దిల్షాన్ ని వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దిల్షాన్ పరిస్థితి విషమించడంతో పెద్దాసుస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించటంతో వారు వెంటనే కాన్పుర్‌ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో దిల్షాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తమ కుమారుడు మరణించడంతో ఉపాధ్యాయుల పట్ల బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు వాచీ దొంగలించాడనే నెపంతో ఉపాద్యాయులు ఇలా దారుణానికి పాల్పడ్డారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.