ఈ యాదాద్రి కరెంట్ సారు ఏం చేసిండో తెలుసా? (వీడియో)

ఆయన కరెంట్ ఆఫీసులో పెద్ద సారు. మంచి జీతంతో ఉద్యోగం. జీతం ప్లెస్ గీతం కలిపి దండిగానే సంపాదించిండు. మంచి ఇల్లు కట్టుకున్నడు. హ్యాప్పీగా ఉండక ఏం మాయరోగమో చూడురి. సంపాదన సరిపోలేదేమో అడ్డదారి తొక్కిండు. అడ్డంగా బుక్కైండు. కరెంటు సారు ఫుల్ స్టోరీ వీడియో కింద ఉన్నాయి చదవండి. చూడండి.

సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనిలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడిలో భువనగిరి ఎలక్ట్రికల్ డిఇ దుర్గారావు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. భాస్కర్ అనే కాంట్రాక్టర్ కు ఎనిమిది లక్షల రూపాయల బిల్స్ పాస్ చేసేందుకు దుర్గారావు కర్మన్ ఘాట్ లోని తన నివాసంలో 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భువనగిరి డివిజన్ లోని రాజాంపేట మండలంలో విద్యుత్ స్తంభాల నిర్మాణ పనులలో భాగంగా పాత బిల్లుల నిధులు విడుదల చేయాల్సి ఉంది. వాటి విడుదలతోపాటు మరో 10 పనులకు సంబంధించి ఒప్పంద అనుమతి కొరకు దుర్గారావు లంచం డిమాండ్ చేశాడు.

ఇప్పటికే కాంట్రాక్టర్ భాస్కర్ గతనెల 30వ తేదీన 54,000/- లు లంచం ఇచ్చాడు.  మరో దఫా కింద 50,000/- లు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇక చేసేది ఏమి లేక అవినీతి నిరోధక శాఖ ను సంప్రదించారు భాస్కర్. దీంతో కర్మన్ ఘాట్ ( గ్రీన్ పార్క్ కాలనీ )లోని తన నివాసంలో భాస్కర్ నుండి 50,000/- లు లంచం తీసుకుంటూ నేరుగా ఏసిబి అధికారులకు పట్టుబడటం జరిగింది. దుర్గారావు పై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లోని దుర్గారావు నివాసంతో పాటు భువనగిరి లోని తన కార్యాలయంలో కుడా సోదాలు నిర్వహిస్తున్నాని అధికారులు తెలిపారు.