ప్రేయసిని చంపి పారిపోయిన యువకుడు.. కాని చివరికి ఇలా?

ప్రస్తుత కాలంలో కొంతమంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వేధించడమే కాకుండా ప్రేమించకపోతే వారి మీద దాడులు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఇలా ప్రేమ పేరుతో ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఇటీవల కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువకుడు అమ్మాయిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు.అయితే యువతిని చంపి పారిపోతున్న యువకుడు కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలలోకి వెళితే…మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కృష్ణయాదవ్‌, నేహా అనే యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కృష్ణ యాదవ్ కి నేహా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తనని దూరం పెట్టిందన్న కోపంతో నేహా మీద కోపం పెంచుకున్న కృష్ణ యాదవ్ ఇటీవల బుధవారం మధ్యాహ్నం బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ దగ్గర తుపాకీతో ఆమె మీద కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కృష్ణ యాదవ్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ క్రమంలో ఒక కారు ఢీ కొట్టిన కూడా కృష్ణ యాదవ్ లేచి పారిపోతుండగా ఆర్మీకి చెందిన ఒక ట్రక్కు ఎదురుగా వచ్చి అతనిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కృష్ణ యాదవ్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.