ప్రస్తుతం దేశంలో మహిళల మీద అత్యాచార నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొంతమంది మహిళలు కూడా పురుషులను గుడ్డిగా నమ్మి వారితో చనువుగా మెలుగుతున్నారు. ఇదే అదునుగా భావించి కొంతమంది నీచులు మహిళల మీద అత్యాచారాలు చేసి వారిని బెదిరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కూడా ఎటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న స్విమ్మింగ్ కోచ్ ఆమెను బలవంతం చేసి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నగ్న ఫోటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.
వివరాలలోకి వెళితే…మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన వివాహిత తన ఇద్దరి పిల్లలకు ఈత నేర్పించడానికి పల్లవి మోడల్ స్కూల్లో స్విమ్మింగ్ కోచ్ గా పని చేస్తున్న బోడుప్పల్ సిద్ధి వినాయక్ కాలనీకి చెందిన సుజిత్ అనే వ్యక్తిని సంప్రదించింది. పిల్లలకు ఈత నేర్పించడానికి అంగీకరించిన సుజిత్ క్రమంగా సదరు మహిళతో పరిచయం పెంచుకొని చనువుగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత ఫోటోలను సేకరించి ఆ ఫోటోలను చూపించి తనతో గడపాలని మహిళను బెదిరించేవాడు. సదరు మహిళ అంగీకరించకపోవడంతో ఆమె భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి మహిళ మీద దాడి చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఈ క్రమంలో నగ్న ఫోటోలు తీసి తన భర్తకు పంపిస్తాను అంటూ మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి లక్ష రూపాయలు వసూలు చేశాడు. రోజురోజుకీ అతని వేదింపులు ఎక్కువ అవ్వటంతో సదరు మహిళ వాటిని భరించలేక షీటీమ్స్ ద్వారా మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్విమ్మింగ్ కోచ్ నీ అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.