పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఓజీ’ గురించి సినీ ప్రేమికులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కళకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మిగిలిన 15 రోజుల షెడ్యూల్ కోసం మేకర్స్ పవన్ డేట్స్ ఖరారు చేయనున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా కనిపించనున్నారు. మరోవైపు, సంక్రాంతి కానుకగా ఓజీ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ టీజర్ ద్వారా సినిమా రేంజ్‌పై స్పష్టత వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ‘ఓజీ’ కథను పార్ట్ 2 వరకూ తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడు’’ లైన్‌తోనే సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. పార్ట్ 2 కోసం పవన్ అంగీకారం అవసరమని, ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి అవసరమైన సెట్‌ల నిర్మాణం విజయవాడ సమీపంలో వేగంగా జరుగుతోంది.
ఫ్యాన్స్ ఇప్పుడు మొదటి భాగం విజయం సాధిస్తే, పార్ట్ 2 మరింత పెద్దస్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. పవన్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సినిమాల లైనప్ పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ‘ఓజీ’ విజయంతో పవన్ అభిమానులకు మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు.