భార్య వంట చేయలేదన్న కోపంతో కన్న కూతురి పట్ల కాలయముడైన తండ్రి…?

సాధారణంగా కోపం వచ్చినప్పుడు మనుషులు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపంలో ఇతర వ్యక్తులను కాకుండా వారి మీద దాడులు చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది తీవ్ర ఆగ్రహంతో వ్యక్తులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇటీవల భార్య వంట చేయలేదని కోపంతో ఊగిపోయిన భర్త తన కోపాన్ని కన్న కూతురి మీద చూపించాడు. కోపంతో నాలుగేళ్లు వయసు ఉన్న కన్న కూతురి తలను నరికి ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక మృతదేహాన్ని నది ఒడ్డున పూడ్చి పెట్టాడు. ఈ విషాదకర సంఘటన బీహార్ లో ఇటీవల చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…బీహార్‌లోని సరౌని గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఇటీవల మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అయితే తాను ఇంటికి వెళ్ళే సమయానికి అతని భార్య వంట చేయకపోవడంతో ఆమెతో గొడవపడ్డాడు. ఆమె మీద దాడి చేయటం తో ఆమె కేకలు పెట్టుకుంటూ పక్కింటికి పారిపోయింది. అయితే ఆ సమయంలో ఇంట్లో నాలుగేళ్ల కూతురు మాత్రమే ఉంది. అప్పటికే తీవ్ర ఆగ్రహంలో ఉన్న రాజ్‌కుమార్ భార్యపై కోపాన్ని కూతురిపై చూపించాడు. ఆవేశంలో నాలుగేళ్ల కూతురి తల నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని ఊరి చివర నది ఒడ్డున పాతిపెట్టాడు.

మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్ భార్య కూతురి కోసం వెతికింది. గ్రామంలోనూ, బంధువుల ఇళ్లలోనూ కూతురి కోసం విచారించింది అయితే ఎక్కడా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు. అయితే ఐదు రోజుల తర్వాత రాజ్‌కుమార్కూతురిని చంపి ఊరి చివర పాతేసినట్టు తన తండ్రికి అసలు విషయం చెప్పాడు.దీంతో గ్రామస్తులు వెళ్లి తవ్వి చూడగా బాలిక మృతదేహం బయటపడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యా నేరం కింద రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.