విద్యార్థి హరిత కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు?

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విద్యార్థి హరిత కేసు సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే…ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకి చెందిన హరిత వర్షిని అనే విద్యార్థిని చదువు కొరకు ఆమె తండ్రి ప్రభాకర్‌రావు రెండేళ్ల క్రితం విజయవాడలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా క్రెడిట్‌ కార్డుపై మూడున్నర లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ రావు డిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు..

అయితే రెండు వేల క్రితం ప్రభాకర్ రావు కూతురు చదువు కోసం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని రికవరీ ఏజెంట్లు ప్రభాకర్ రావు ఇంటి వద్దకు వచ్చి అతని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశారు. రికవరీ కోసం మొదట శ్రీనివాసరావు, నాగరాజు అనే వ్యక్తులు ప్రభాకర్ రావు ఇంటికి వచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత సాయి, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ రావు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించకపోతే తన తండ్రిని అరెస్టు చేయిస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించారు. దీంతో హరిత వర్షిని తీవ్ర ఆందోళనకు గురైంది.

లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన హరిత తన తండ్రిని అరెస్టు చేస్తారన్న భయంతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. హరిత మరణించిన తర్వాత ఆమె వద్ద లభించిన సూసైడ్ లెటర్ తో పాటు ప్రభాకర్ రావు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నందిగామ పోలీసులు లోన్ రికవరీ ఏజెంట్లు అయిన నాగరాజు, శ్రీనివాసరావు , సాయి, పవన్ తో పాటు ముగ్గురు మేనేజర్లను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పవన్ సాయి లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. అయితే రెండు రోజులుగా పోలీసులు కళ్ళు నొప్పి తప్పించుకుని తిరుగుతున్న వీరిని ఇటీవల శనివారం రాత్రి విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులతో స్వీకరణ ప్రవర్తించినట్లు వారు అంగీకరించారు.