(జి.సుగుణాకర్ రెడ్డి)
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ విభజన అనంతరం తొలి ప్రధాన న్యాయ మూర్తి గా చాగరిప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేసారు. 2012 జూన్ 29 న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హై కోర్ట్ కు అదనపు న్యాయ మూర్తి గా నియమితులైన ప్రవీణ్ కుమార్ 2013 డిసెంబర్ 4 న శాశ్వత న్యాయమూర్తి గా నియమితులయ్యారు. తాజా గా హై కోర్ట్ ను విభజించడం తో ఏపీ నూతన హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా చాగరి ప్రవీణ్ కుమార్ ని నియమించారు.
ప్రవీణ్ కుమార్ ఎవరో కాదు ప్రముఖ న్యాయవాది, మానవతావాది సి.పద్మనాభ రెడ్డి కుమారుడే. 60 ఎళ్ల పాటు న్యాయవాద వృత్తి లో పద్మనాభ రెడ్డి సేవలను న్యాయ ప్రముఖులు ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. పీజులు చెల్లించుకోలేని పేదలకు పద్మనాభ రెడ్డి పెద్ద దిక్కు గా ఉండేవారు.
పీజు తో నిమిత్తం లేకుండా కేసులు వాదించేవారు, ఎవరైనా పేదలు పీజు చెల్లించేందుకు అప్పు చేసారని తెలిస్తే వారికి తిరిగి ఇచ్చేవారు. కొందరికి చార్జీలకు డబ్బులు కూడా ఇచ్చేవారు. ఏ కేసు విషయం లోనైనా న్యాయమూర్తులు ఒక నిర్ధారణ కు రాలేకపొతే పద్మ నాభ రెడ్డి సలహాలు తీసుకునేవారు ఆరోజుల్లో.
పోలీసులు ఎన్ కౌంటర్ లో ఎవరైనా చనిపోతే కేసు నమోదు చేయాలా ?వద్దా ? అన్న దానిపై న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి రాలేని సమయం లో కోర్ట్ సహాయ అధికారిగా నియమితులయ్యారు పద్మనాభరెడ్డి.
ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే అది ఎన్కౌంటర్ అని తీర్పులు ఇచ్చుకోవడం సరికాదని పద్మ నాభ రెడ్డి సూచించారు. దింతో ఎన్కౌంటర్ జరిగితే పోలీసులపై కేసు నమోదు చేయాలని హై కోర్ట్ తీర్పు చెప్పింది. వామపక్ష వాదిగా, ప్రజా ఉద్యమాలకు పద్మనాభ రెడ్డి అండ దండలు కూడా అందించారు.
అయితే ఇంత ఘనత ఉన్న పద్మనాభరెడ్డి హైకోర్టు న్యాయమూర్తి మాత్రం కాలేక పోయారు. పద్మనాభరెడ్డి వామపక్ష భావజాలాన్ని చూపూతూ ఈయనకి కొన్ని రాజకీయ విశ్వాసాలు ఉన్నాయంటూ ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో అయనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ న్యాయమూర్తి కాలేక పోయారు. అయితే 2013లో పద్మనాభరెడ్డి కన్నుమూశారు.
పద్మనాభ రెడ్డి అనంతపురం జిల్లా యాడికి గ్రామం లో ఓ మధ్య తరగతి కుటుంబం లో జన్మించారు. పద్మనాభ రెడ్డి ని న్యాయమూర్తి గా కాకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ … అయన కొడుకు చాగరి ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తిగా కాగలిగారు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసారు.
తండ్రిని జస్టిస్ కాకుండా ఆపితే కొడుకు చీఫ్ జస్టిస్ కావడంతో రాయలసీమలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.